రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి సత్తె పీర్ల దర్గాకు వెళ్లే దారిలో సుమారు 70 సంవత్సరాల గుర్తుతెలియని వృద్ధుడు మంగళవారంరాత్రి నడుచుకుంటూ గొల్లపల్లి వైపు వస్తుండగా వెనకనుంచి ఏదో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు.పోలీసులు 108 కు సమాచారం అందించి మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలోకి తరలించారు.
