అక్రమ అరెస్టులు ఆపాలి……
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మండల బిజెపి అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి లను సోమవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు వేములవాడ నియోజకవర్గంలోని నంది కమాన్ దగ్గర ముంపు బాధితుల పరిహారం కోసం అఖిలపక్షాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమానికి వెళ్లకుండా అరెస్టు చేయడం జరిగింది ఈ అరెస్టును నాయకులు తీవ్రంగా ఖండించారు
