రసమయి పై- పోటీకి సిద్ధం
మానకోండూర్ నియోజవర్గంలో బిజెపి జెండా ఎగరవేస్తా
– రాపాక ప్రవీణ్
(కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం సెప్టెంబర్ 10)
ఆదివారం హైద్రరాబాద్ లోని నాంపల్లి బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బిజెపి మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించాలని బిజెపి మానకొండూర్ మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్ దరఖాస్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యువకుడిని, విద్యావంతుడిని, స్థానికుడిని నాకు అవకాశం కల్పించాలని పార్టీ నాయకత్వానికి విన్నవించారు. ఏబీవీపీ విద్యార్థినేతగా 2010 నుండి 2016 వరకు మానకొండూర్ మండల కన్వీనర్ గా, మానకొండూర్ నియోజకవర్గం కన్వీనర్ గా, తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేశాను. అనంతరం 2016లో బిజెపి పార్టీలో చేరి బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడిగా, మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం బిజెపి మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్న తెలియజేశారు. గతంలో “మాక్ అసెంబ్లీలో ఒకరోజు ఎమ్మెల్యేగా” పనిచేసిన అనుభవం ఉంది. గత 13 సంవత్సరాలుగా మానకొండూర్ మండలంతో పాటు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల ద్వారా అందరికీ సుపరిచితునిగా పనిచేస్తున్నని గుర్తుచేశారు. ఒకసారి అవకాశం కల్పించండి రసమయి బాలకిషన్ ను ఓడించి తీరుతానని అన్నారు. ఈసారి మానకొండూర్ నియోజకవర్గం లో బిజెపి జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి గీత కార్మిక సెల్ జిల్లా కన్వీనర్ పూదరి రమణ గౌడ్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మియాపురం లక్ష్మణాచారి, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కూన మహేష్ ముదిరాజ్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి వంగల ఆంజనేయులు, మండల ఉపాధ్యక్షులు కంది రాజీరెడ్డి, ఓబిసి మోర్చా మండల అధ్యక్షులు మార్కొండ రమేష్ పటేల్, ప్రధాన కార్యదర్శి ఎదులపురం అశ్వన్ తేజ, కార్యదర్శి ఆసరి రమేష్ యాదవ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి మర్రి అంజి, నాయకులు: బల్ల అంజి ముదిరాజ్, హరికాంతం అనిల్ రెడ్డి పాల్గొన్నారు.