ముస్తాబాద్, ఫిబ్రవరి 1 (24/7న్యూస్ ప్రతినిధి)
ముస్తాబాద్ మండల కేంద్రం లోని ఆంధ్ర బ్యాంకు సమీపంలో కేజ్రీ
ఫోటో స్టూడియోలో బుధవారం రాత్రి సుమారుగా 11 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ సంభవించిందని స్థానికులు తెలిపారని బాధితుడు తెలిపారు. దీంతో మంటలు చెలరేగి దుకాణంలో ఉన్న విలువైన ఫర్నిచర్, కంప్యూటర్ తదితర సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను మరింత వ్యాప్తి చెందకుండా అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే సామాగ్రి మొత్తం కాలి బూడిద అవడంతో మొత్తం రూ. సుమారుగా 5 నుండి 6 లక్షల వరకు విలువైన ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు కొమ్మెట శ్రీకాంత్ తండ్రి చంద్రయ్య బంధనకల్ వాసి తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




