ప్రాంతీయం

వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలి

98 Views

*గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఎటువంటి సంఘటనలకు తావివ్వకుండా ఏర్పాట్లు చేయాలి*

*సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ*

జిల్లాలో ఈ నెల 9 వ తేదీన నిర్వహించబోయే వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే లు ఆదేశించారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ లు సంబంధిత అధికారులతో వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో 580 విగ్రహాలు, వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో 220 విగ్రహాలను ఏర్పాటు చేశారని, వీటిని నిమజ్జనం చేసేందుకు వీలుగా ప్రతీ చోట 3 క్రేన్ లు అందుబాటులో ఉన్నాయని అధికారులకు సంబంధిత మున్సిపల్ కమీషనర్లు వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ ముఖ్యంగా సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్యుత్ తీగలు కిందికి ఉన్నచోట వెంటనే అప్రమత్తతా చర్యలు చేపట్టాలని సెస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్,లైటింగ్, సీసీ కెమెరాలు అమర్చాలని సూచించారు. చెరువుల వద్ద గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండే విధంగా చూడాలని జిల్లా మత్స్య శాఖ అధికారిని ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ముఖ్యమైన ప్రదేశాల్లో ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నిమజ్జనం చేసే ప్రదేశాలల్లో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయితీ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించేలా బాధ్యతలు అప్పగించాలని ఆర్డీఓ లకు సూచించారు. మండల, గ్రామ స్థాయిలో నిమజ్జనం నిర్వహించే ప్రదేశాల జాబితా మంగళవారం సాయంత్రం లోగా సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా, నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలని కలెక్టర్ అన్నారు.జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ వినాయక నిమజ్జనం సందర్భంగా క్షేత్ర స్థాయిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ తరపున బందోబస్త్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నిమజ్జనం చేసేందుకు వీలుగా అందుబాటులో ఉంచిన క్రేన్ డ్రైవర్లు షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తించేలా చూడాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సిరిసిల్ల, వేములవాడ పట్టణ సీఐ లను ఆదేశించారు. బారికేడింగ్ ఏర్పాటు చేయాలని, ప్రమాదకరమైన ప్రదేశాలను ముందే గుర్తించి, అప్రమత్తతా చర్యలు చేపట్టాలని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అన్నారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్, ఇంఛార్జి డీఆర్ఓ టి.శ్రీనివాస రావు, జిల్లా పరిషత్ సీఈఓ గౌతం రెడ్డి, వేములవాడ ఆర్డీఓ వి.లీల, జిల్లా పంచాయితీ అధికారి రవీందర్, టాస్క్ ఫోర్స్ డీఎస్పీ రవి కుమార్, జిల్లా మత్స్య శాఖ అధికారి శివ ప్రసాద్, నీటి పారుదల శాఖ అధికారి అమరేందర్ రెడ్డి, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమీషనర్లు సమ్మయ్య, శ్యామ్ సుందర్ రావు, తహశీల్దార్లు విజయ్ కుమార్, రాజు, సీఐ లు అనిల్ కుమార్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7