ప్రాంతీయం

దుబ్బాక ప్రాంతీయ ఆసుపత్రిలో మరొక అరుదైన ఆపరేషన్

137 Views

సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతీయ ఆసుపత్రిలో సూపరిడెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ మరొక అరుదైన ఆపరేషన్ చేశారు.దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని దౌల్తాబాద్ మండలంకు చెందిన బేకరీ రాధిక వయసు 38 సంవత్సరాలు,గత రెండు సంవత్సరాల నుండి కడుపునొప్పితో బాధపడుతూ అనేక ప్రైవేట్ ఆస్పత్రులు తిరిగి తిరిగి దుబ్బాక వంద పడకల ఆసుపత్రికి రెండు రోజుల క్రితం రావడం జరిగింది.వారికి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి కడుపులో లాడ్జ్ పైబ్రాయిడ్ గడ్డ ఉందని డాక్టర్ హేమరాజ్ సింగ్ నిర్ధారణ చేసి సోమవారం రోజు 18 * 20*15 సెంటీమీటర్ల సుమారుగా 5.5 కిలోల ఫైబ్రాయిడ్ గడ్డను ఆపరేషన్ చేసి తొలిగించడం జరిగింది.ఈ ఆపరేషన్ చేయడానికి 1 గంట 30 నిమిషాల సమయం పట్టింది ప్రస్తుతం రోగి ఆరోగ్యంగా ఉన్నారు వారి కుటుంబ సభ్యులు డాక్టర్ల ను వైద్య సిబ్బంది అభినందిచారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *