హుజురాబాద్ మండలం చేల్పూర్ జూనియర్ లైన్మెన్ అంబాల వెంకటేశ్వర్లు లను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అభినందించారు.
మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలకు చెల్పూర్ గ్రామంలోని చెరువులో ఉన్న విద్యుత్ స్తంభం బ్రేక్ డౌన్ కాగా వెంకటేశ్వర్లు ఈదుకుంటూ వెళ్లి మరమ్మత్తు చేసిన విషయం తెలిసింది అయితే బుధవారం రోజున హుజురాబాద్ తన కార్యాలయంలో, జూనియర్ లైన్మెన్ వెంకటేశ్వర్లకు శాలువా కప్పి చైర్మన్ బండ .శ్రీనివాస్ సత్కరించారు.
ప్రాణాలకు తెగించి గ్రామాలకు విద్యుత్ పునర్దించినందుకు సంతోషకరమన్నాడు. ఈ సన్మాన కార్యక్రమంలో
జేఏసీ కన్వీనర్ వేల్పుల రత్నం, సంపంగి రాజేందర్, రవీందర్, ముక్క పల్లి రమేష్, పాల సమ్మయ్య, అంబాల రవీందర్, బండ కిషన్, అనిల్ మాట్ల, ఆర్టీసీ ప్రభాకర్* తదితరులు పాల్గొన్నారు.