కొంగర నవంబర్ 20:ఎమ్మెల్యే కందాళ కారును,ప్రచారథంను తనిఖీ చేసిన పోలీసులు.
పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి వాహనాన్ని,ప్రచారధాన్ని ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు అప్పలనర్సింహాపురం,కొంగర క్రాస్ రోడ్డు నందు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు,ప్రచారరథంను ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు.తనిఖీలకు సహకరించినందుకు కందాళ కు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.