రాజన్నసిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన ఆయా మండలాల అధ్యక్షులు హైదరాబాదులోని బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణమండపంలో కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతులకు శనివారం హాజరయ్యారు.
సిరిసిల్ల నియోజకవర్గం లోని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హమీద్ వీర్నపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూత శ్రీనివాస్ సీనియర్ నాయకులు దొమ్మాటి నరసయ్య శిక్షణ తరగతులలో పాల్గొన్నారు.రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రణాళికలను పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంచార్జ్ మానిక్ రావు ఠాక్రే వివరించారు.