*టిఆర్ టి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటకం రమేష్.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలకేంద్రం లో విలేకరుల సమావేశం లో శనివారం తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్పించుకొని పాఠశాల విద్యాశాఖను వెంటనే సమీక్షించాలని టిఆర్ టి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటకం రమేష్ పేర్కొన్నారు.
గంభీరావుపేట కేంద్రంలో జరిగిన టిఆర్ టి ఎఫ్ సమావేశంలో ముఖ్య అతిథిగా వారు పాల్గొని ప్రసంగించారు.
గత 7 సంవత్సరాలుగా ఉపాధ్యాయ పదోన్నతులు లేవని, నా 3 సంవత్సరాలుగా పదోన్నతులు లేవని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, అయినా విద్యా వాలంటీర్లను కేటాయించడం లేదని వారు తెలిపారు.
ఒక్కో ప్రధానోపాధ్యాయునికి తన పాఠశాలతో పాటు సుమారు 6, 7 మండలాలకు ఇంఛార్జి విద్యాధికారులుగా నియమించడం ప్రాథమిక పాఠశాల విద్యపై తీవ్ర ప్రభావం పడిందని పేర్కొన్నారు.
బాత్రూంలో పరిశుభ్రత కొరబడిందని తక్షణమే స్కావెంజర్ నియామకాలు అవసరమని వారు పేర్కొన్నారు
పాఠశాల విద్యపై గౌరవ ముఖ్యమంత్రి సమీక్షించి తగు చర్యలు చేపట్టి ప్రభుత్వ పాఠశాల విద్యను కాపాడాలని వారన్నారు
ఈ దసరా సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు మరియు దసరా కానుకగా పెండింగ్ మూడు డిఏలు చెల్లించాలని వారు ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు.
జిల్లా అధ్యక్షులు భోయన్నగారి నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండల జిల్లా ప్రతినిధులు బాల ఎల్లయ్య, గంద్యాడపు శ్రీనివాస్, ముత్తయ్యగారి నాగరాజు, చిట్టంపల్లి బాలకిషన్, శనిగరం మహేష్, శనిగరం రామచంద్రం, కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.