ఎమ్మెల్యేను సన్మానించిన టిఏజెఎఫ్ సభ్యులు
సెప్టెంబర్ 06
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ రైతు వేదికలో తడ్కల్ ను నూతన మండలంగా ప్రకటించి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన తొలిప్రాయంలో వచ్చిన సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గం అభివృద్ధి ప్రదాతను ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి,ని టీఏజేఎఫ్ యూనియన్ సభ్యులు శాలువాతో సన్మానించి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ నూతన మండలంగా ప్రకటించినందుకు ఎమ్మెల్యే పరిసర గ్రామాల ప్రజల నుంచి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.నియోజకవర్గంలో నాలుగు మండలాలను నూతనంగా ఏర్పాటు చేసి ప్రజల పరిపాలన సౌలభ్యం కోసం అభివృద్ధి చేస్తున్నందుకు తడ్కల్ మండల పాత్రికేయులు హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంగీత వెంకటరెడ్డి,కోట లలిత ఆంజనేయులు,మండల పార్టీ అధ్యక్షులు ఎస్కే గంగారం,టిఏజెఎఫ్ యూనియన్ సభ్యులు రుస్తుం జలీల్,లాల్ కుమార్,సాయి కిరణ్, ఇదాయత్,పాటిల్ ఉదయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
