Breaking News

✍️తెలంగాణలో మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు.

113 Views

*✍️తెలంగాణలో మొదటి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు.

 

తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా బీటెక్కు సంబంధించి మొదటి విడతలో 70,665 ఇంజినీరింగ్ సీట్లను కేటాయించారు. ఈ కేటాయింపుల తర్వాత 12,001 (14.52 శాతం) సీట్లు భర్తీ కాకుండా మిగిలాయి. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 22లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఎంసెట్ కన్వీనర్ సూచించారు. కోర్సుల వారీగా తొలి విడతలో సీఎస్ఈలో 94.20 శాతం, ఈఈఈలో 58.38, సివిల్లో 44.76, మెకానికల్లో 38.50 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 3 యూనివర్సిటీలు, 28 ప్రైవేటు కాలేజీల్లో ఇంజినీరింగ్ సీట్లన్నీ నిండాయని అధికారులు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *