రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ శివారులో భారత్ పెట్రోల్ పంపు లో ఉన్న సర్వీసులు పని చేయకపోవడంతో అలంకారపాయంగా ఉండిపోయాయి.బుధవారం రోజు ఓ వాహనదారుడు డీజిల్ వాహనంలో పోయించుకొని అక్కడే ఉన్న గాలి వాహనంలో ఫిల్ చేయాల్సిందిగా కస్టమర్ కోరాగా అక్కడే విధులు నిర్వహిస్తున్న పంపు నిర్వాహకులు అది పనిచేయదు ఎవరికి కంప్లైంట్ చేస్తారో చేసుకోండి అంటూ దురుసుగా ప్రవర్తించారు. వాహనదారుడు టైర్లలో గాలి లేకపోవడంతో పలుమార్లు రిక్వెస్ట్ చేసిన పట్టించుకోలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పెట్రోల్ బంకులో ఉన్న సర్వీసులు శూన్యంగా ఉన్నందునమూత్రశాలలు, మంచినీరు, బియ్యగదారుడు సేవలు, వాహనదారులపై దూసుకు ప్రవర్తిస్తుందున శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
డిస్టిక్ సివిల్ సప్లై జితేందర్ రెడ్డిని చరవాణి ద్వారా వివరణ కోరగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్న పెట్రోల్ పంపు లపై తనిఖీలు నిర్వహించి ఎవరైతే సరియైన నిబంధనలు పాటించరు వారి పైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.