ప్రాంతీయం

వడగళ్లతో ఆపార నష్టంతో అన్నదాతల ఆశలు ఆవిరి …

34 Views

ముస్తాబాద్, ఏప్రిల్ 18 (24/7న్యూస్ ప్రతినిధి): వడగళ్ల వర్షంతో అన్నదాతలు హరి గోసలు ఏడవడానికి కళ్ళల్లో తడిలేకుండా పోయింది. ఇక ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో బావుల్లో నీరు లేక పొట్టకొచ్చిన వరిపంటలు ఎండిపోయాయి. మరో వైపు చేతికచ్చిన వరి పంటపై వడగళ్లతో   చూస్తుండగా పడడంతో నేలపాలు అవుతుండగా నిస్సహాయ స్థితిలో రైతులు..  కోసిన ఆరబోసి తూకానికి అందించిన ధాన్యం తడిసి ముద్దవ్వడంతో ఆరబెట్టడానికి హరిగోశలు పడుతున్నారు. ఇప్పటికీ మండలంలో వరి కోతలు సుమారుగా 65 శాతం కాగా కొనుగోలు కేంద్రాలు నత్త నడకన నడుస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేంలేక అవసరాల నిమిత్తం తెచ్చినప్పుకు వడ్డీలు తీర్చలేకనే బాధలతో తక్కువ ధరకే దళారులకు విక్రయిస్తున్న వైనం. ఇదే అదును చూసుకొని తరుగులో దళారుల చేతివాటం పలు విదాల జులిపించడంతో రైతులు మోసపోతున్నారని పలువురు ఆరోపణలు వెల్లువెత్తాయి. రోజురోజుకు అన్నదాతల ఆశలు ఆవిరైపోతున్నాయి. నేడుపడిన వడగళ్లు ఈదురు గాలులతో వరి పంటలతో పాటు మామిడి కాయలు నేలపాలు అనేకమైన చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకోరిగాయి రైతులకు తీరని లోటని చెప్పుకోవచ్చు కొందరు మహిళా రైతులు తమ వరిచేనుల వద్ద బోరుమని విలపించడంతో పలువురిని కలిసివేసింది.. స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం పరంగా రైతులను ఆదుకోవాలని కోరారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్