హైదరాబాద్:అక్టోబర్ 14
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్ శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది.శామీర్ పేటలో 65 కి.మి బోర్డ్ వద్ద ఆగి ఉన్న లారీని ఇన్నోవా కారు గట్టిగ ఢీకొన్నది. అక్కడికక్కడే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. మృతి చెందినవారు కుదుపుల్లాపూర్ కు చెందిన మారుతి, రాజు అని పోలీసులు తెలిపారు. కారులోని వారు కీసర నుండి మేడ్చల్ వైపుగా ఓ ఆర్ ఆర్ పై వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది .
