ఏప్రిల్ 6, 24/7 తెలుగు న్యూస్ :మా ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి.
ఎన్నికల కంటే ముందే నా ఫోన్ తో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారు.
ఈ వ్యవహారంపై గతంలోనే డీజీపీ ఫిర్యాదు చేశాం: మంత్రి జూపల్లి.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గత అక్టోబర్ నెలలో తనతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్లు ట్యాప్ కు గురైనట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. గాంధీ భవన్ లో మంత్రి మీడియాతో మాట్లాడారు. దీనిపై అప్పట్లోనే డీజీపీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ఎవరిని వదిలేది లేదని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు._