పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి
మర్కుక్ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన మర్కుక్ రైతు వేదిక వద్ద మర్కుక్ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ ఆద్వర్యంలో ఎంపీపీ తాండ పండు గౌడ్ జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి ఆత్మ కమిటీ డైరెక్టర్ సంతోష్ రెడ్డిలతో కలసి మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సుధాకర్ రెడ్డి ఎంపీవో రాజలింగం ఏవో నాగేందర్ రెడ్డి ఏఈఓ లు రజనీకాంత్ ఈసీ రాజు గంగాపూర్ ఉపసర్పంచ్ జగదీష్ సింగ్ సెక్రెటరీ మౌన శ్రీలత సిఏలు కావ్య కవిత స్వాతి మౌనిక గ్రామ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
