Breaking News

మద్యం షాపుల టెండర్లు షురూ

144 Views

మద్యం షాపుల టెండర్లు షురూ:జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎస్ పంచాక్షరి – పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడి.

సిరిసిల్ల 05, ఆగస్ట్ 2023

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ వెలువడిందనీ జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎస్ పంచాక్షరి అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 48 మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 4 వ తేదీన ప్రారంభించినట్లు జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎస్ పంచాక్షరి తెలిపారు .

ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎస్ పంచాక్షరి వెల్లడించారు. దరఖాస్తులను సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నీ మొదటి అంతస్తు నందు గల జీ-36 గదిలో తీసుకుంటామని తెలిపారు.శనివారం ఐ డి ఓ సి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎస్ పంచాక్షరి వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎస్ పంచాక్షరి మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 48 మద్యం దుకాణాలకు 2023-25 సంవత్సరానికి టెండర్ల ప్రక్రియ నిర్వహించడానికి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయ్యిందన్నారు.

జిల్లాలో 48 మద్యం షాపులకు గాను 14 మద్యం దుకాణాలకు రిజర్వేషన్లను ఖరారు అయ్యాయని చెప్పారు.

ఇందులో గౌడ కమ్యూనిటీ కి 15 శాతం అనగా (9) ఎస్సీలకు 10 శాతం అనగా (5) మద్యం దుకాణాలకు లక్కీ డ్రా ద్వారా రిజర్వేషన్లను ఖరారు అయ్యాయని అన్నారు. 70% అనగా (34) మద్యం దుకాణాలకు జనరల్ క్రింద కేటాయించడం జరిగిందన్నారు.

*ఏ షాప్ లో ఎంత బిజినెస్ జరిగిందో*
*హెల్ప్ డెస్క్ లో చెబుతారు*

ఏ షాప్ లో ఎంత బిజినెస్ జరిగిందో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్న వారు ఐ డి ఓ సి లోని మొదటి అంతస్తు నందు గల జీ-36 వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లో సంప్రదిస్తే అన్ని వివరాలు చెబుతారనీ జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎస్ పంచాక్షరి అన్నారు. అలాగే షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయి…వాటి లొకేషన్, రిజర్వేషన్ వివరాలను తెలుసుకోవచ్చన్నారు.

ఐ డి ఓ సి కి వచ్చి వివరాలు తెలుసుకోవడం ఇబ్బందిగా ఉంటే సమీప ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లను కూడా సంప్రదించవచ్చునని
తెలిపారు.*ఒక వ్యక్తీ ఎన్నైనా దరఖాస్తులు చేయొచ్చు*ఒక వ్యక్తి ఒకే షాపులో ఎన్నైనా దరఖాస్తులు చేయవచ్చునని జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎస్ పంచాక్షరి తెలిపారు అలాగే ఒకే వ్యక్తి అనేక షాపులకు దరఖాస్తు చేసే సౌలభ్యం కూడా ఉందన్నారు. సమావేశంలో గులాం ముస్తాఫా, సి ఐ,సిరిసిల్ల , ఎం పి ఆర్ (మరాఠీ పోష్ రాజ) చంద్రశేఖర్, సి ఐ, ఎల్లారెడ్డి పేట ,

గుండేటి రాము, సీఐ, వేములవాడ లు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *