పాల్వంచ, కొత్తగూడం మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన : ఎమ్మెల్యే వనమా
తెలంగాణ నగర్, బంజారా కాలనీల కు విద్యుత్ సరఫరా విషయంపై ఎలక్ట్రిక్ అధికారులతో సమీక్ష నిర్వహించిన : ఎమ్మెల్యే వనమా
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని అధికారులను హెచ్చరించిన : ఎమ్మెల్యే వనమా
కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలకు సంబంధించి జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని అధికారులను హెచ్చరించిన
కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు.
ఈ యొక్క సమీక్ష సమావేశంలో కొత్తగూడెం కమిషనర్ రఘు, పాల్వంచ కమిషనర్ స్వామి, మున్సిపల్ డీఈలు రవి, మురళి, పాల్వంచ ఎలక్ట్రికల్ డి ఈ నందయ్య, ఏడిఈ లక్ష్మణ్, ఏఈ లు రాంబాబు, సాహితీ, మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.