అక్టోబర్ 12
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలకు అక్టోబర్ 13 నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.మొత్తం 13 రోజులు సెలవులు ముగిశాక… అక్టోబర్ 26న పాఠశాలలు తిరిగి తెరచుకొనున్నాయి.కాగా అన్ని సమ్మేటివే,అసైన్మెంట్ పరీక్షలు నిన్నటితో ముగిశాయి. వీటి ఫలితాలను సెలవుల అనంతరం వెల్లడిస్తారు. అటు రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.





