పేదల సొంతింటి కల సాకారం చేసే దిశగా సకల సౌకర్యాలతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను బీఆర్‌ఎస్ ప్రభుత్వం దశలవారీగా పేదలకు పంపిణీ చేస్తున్నది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 2 న గ్రేటర్ హైదరాబాద్ లో ఒకేరోజు 11,700 గృహాలను 24 నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు అందజేయనుంది.
