*రెవెన్యూ డివిజన్ ప్రకటించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధం*
*ప్రజాసంఘాల మద్దతుతో జనగామ ఎమ్మెల్యే బరిలో భైరవభట్ల చక్రధారి*
*ముగింపు సభలో మాట్లాడిన చేర్యాల రెవెన్యూ డివిజన్ జాక్ చైర్మన్ బైరావభట్ల చక్రధర్*
చేర్యాల: మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్థలో గత ఐదు రోజులుగా ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష శుక్రవారం నాడి ముగింపు సభలో జనగామ మరియు చేర్యాల ప్రాంత అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు జేఏసీగా ఎన్నో ఉద్యమాలకు శ్రీకారం చుట్టామని చేర్యాల రెవిన్యూ డివిజన్ జేఏసీ చైర్మన్ భైరవభట్ల చక్రధర్ గారు అన్నారు.
ఈ సందర్భంగా చక్రధర్ మాట్లాడుతూ….. జేఏసీగా ఇసుక మాఫియాను, చేర్యాల కుడి చెరువును, దుద్దెడ నుంచి జనగామ వరకు బీటీ రోడ్డు సాంక్షన్ మరియు వడ్ల కుంబకోణాన్ని బట్టబయలు చేశామని ఈ ప్రాంతంలో ఎన్నో రకాల ఉద్యమాలు చేసి సాధించుకున్నామని అన్నారు. చేర్యాల రెవిన్యూ డివిజన్ జేఏసీగా విఆర్వో, వివోఏ, గ్రామ కార్యదర్శుల మరియు గ్రామ సిబ్బందుల సమస్యల కోసం పోరాడుతున్నటువంటి ధర్నాకు మద్దతు ప్రకటించడం జరిగిందని పేద,బడుగు బలహీన వర్గాల అండతో ఈసారి జనగామ ఎమ్మెల్యే బరిలో మీ భైరవబాట్ల చక్రధారిగా పోటీకి సిద్ధంగా ఉన్నానని ఒక స్థానికునిగా అవకాశం ఇస్తే ఉద్యమాలతో పాటు ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి చేస్తానని ముగింపు సభలో ఆయన అన్నారు. ఈ రిలే నిరాహార దీక్షకు మద్దతు ప్రకటించిన ప్రజా సంఘాలకు, రాజకీయ పార్టీలకు, విద్యార్థి సంఘాలకు, రైతు సంఘాలకు, ఉపాధ్యాయ సంఘాలకు, మానవ హక్కుల సంఘాలకు, నాలుగు మండలాల ప్రజలకు మరియు మీడియా మిత్రులకు,రెవెన్యూ డివిజన్ ఈ నెల రోజులలో ప్రకటించకపోతే అమరణ నిరాహార దీక్షకు పునుకుంటామని చక్రధారి హెచ్చరించారు. ఈ నిరాహార దీక్షలో జేఏసీ వైస్ చైర్మన్ ఒగ్గు రాజు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి అందె బీరన్న, సీనియర్ రిపోర్టర్ సూర్యం, ఎన్ఎస్యూఐ నాయకుడు రాకేష్ కృష్ణన్,ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు,ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామగాళ్ల నరేష్, నాస్తిక్ రమేష్, రాజేష్, నాగరాజు, కిరణ్ కుమార్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
