స్త్రీ నిధి ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధి.
ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి
స్త్రీ నిధి ఋణాల ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని ఐకెపి ఎపియం మల్లేశం అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ కావేరి మండల సమాఖ్య కార్యాలయం లో సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంక్ లింకేజీ,స్ట్రీనిది ఋణాలను తీసుకొని సక్రమంగా చెల్లించాలన్నారు .అన్ని సంఘాల సమావేశాలు క్రమం తప్పకుండా సమావేశం నిర్వహించుకోవాలన్నారు. అనంతరం అధ్యక్షురాలు జ్యోతి పోషణ మాసం లో భాగంగా ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల కూరగాయలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. 18 సంవత్సరాలు దాటినా ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు.స్వచ్చత సేవ కార్యక్రమంలో మానవహారం,ర్యాలీ,రంగోళి కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు. సఖి కేంద్రం డి హబ్ కో ఆర్డినటర్ రోజా, జెండర్ స్పెషలిస్ట్ దేవిక లు మాట్లాడుతూ మహిళలు, పిల్లలకు చైతన్యం కల్పించుట కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 181 మహిళలకు, 1098 పిల్లలకు, అంగన్వాడీ 155209,వయో వృద్ధులకు 14567,దివ్యంగులకు 155326. మానసిక సమస్యల కొరకు 18004253333 పైన ఉన్న చరవాణి నెంబర్ల ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు బైరి జ్యోతి,సీసీ లు, అన్ని గ్రామ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.
