నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం శిలార్మీయగూడెం గ్రామంలో గురువారం ఉదయం 5గం, సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన పోకల జానయ్య వయసు(40) ఉదయాన్నే బహిర్భూమికి వెళ్లి వస్తుండగ వెనుకనుంచి అతివేగంగా వచ్చిన డీసీఎం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ కేసు విషయమై తిప్పర్తి ఎస్ఐ ధర్మ మాట్లాడుతూ కుటుంబ సభ్యులు ఇచ్చిన కేసు మేరకు దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు కాగా మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
