Breaking News

కాంటాక్ట్ కార్మికుల* *బతుకు మారేది* **ఎప్పుడు?*

75 Views

*సింగరేణి

కాంటాక్ట్ కార్మికుల* *బతుకు మారేది* **ఎప్పుడు?*

మంచిర్యాల ఆగస్టు 31 సింగరేణిలో గత కొన్ని సంవత్సరాలుగా కనీస వేతనానికి నోచుకోకుండా ఎన్నో రకాల వెట్టిచాకిరి చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల బతుకులు దయనీయమైన పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి నేటికీ కాంట్రాక్ట్ కార్మికుల దుస్థితి రోజురోజుకు దిగజారుతూనే ఉంది మార్కెట్లో నిత్యవసర సరుకులన్ని ఆకాశాన్ని అంటుతుంటే కాంటాక్ట్ కార్మికులు పొందుతున్న వేతనం అతి తక్కువగా ఉండడం వారి బ్రతుకులకు భరోసనివ్వలేకపోతోంది 5 వందల కూలీకి భూగర్భంలో విధులు నిర్వహిస్తున్న దయనీయమైన పరిస్థితి వీరిది సింగరేణిలో మాత్రం వేలకోట్ల రూపాయలు లాభాలు పొందుతున్నామని గొప్పలు చెప్పుకొని అవార్డులు పొందుతున్న అధికారులు వీరి శ్రమదోపిడిని పట్టించుకున్న పాపాన పోలేదు వీరి ఓట్లు పొందుతున్న ప్రజా ప్రతినిధులు వీళ్ళ బ్రతుకు దిక్కు తొంగి చూసిన చరిత్ర కూడా ఎక్కడ కానరాదు ఓట్లొచ్చినప్పుడు తప్ప వీరు పాలకులకు గుర్తుకురారు ఒక్కసారి ఓట్లు వేస్తే ఐదు సంవత్సరాల వరకు వీళ్లను మందలిచ్చినోళ్లే ఉండరు వీళ్ళు ఎదురుపడితే బాగున్నవా తల్లి బాగున్నవా అన్నా అనే నాథుడే కానరాదు ఓట్లప్పుడు అరచేతుల వైకుంఠం చూపించి మీకు గొప్ప గొప్ప బిల్డింగులు రెండు పడకల గదుల భవనాలు కేటాయిస్తామని చెప్పడమే కానీ ఆచరణలో ఎక్కడ కనపడదు వీళ్లంతా అరిచి గీపెట్టిన పాలకుల చెవికెక్కదు తాబేదారులకు కనపడదు వీళ్ళ బాధలు చెప్పుకుందామంటే ప్రజా ప్రతినిధుల పర్యటనలు ఉన్నప్పుడు వీళ్ళ సమస్యల నెట్టేటోళ్లను ముందుగాల అరెస్టులు చేసి పోలీస్ కస్టడీల పెడతరు మరి వీళ్ళ బాధలు తీరేది ఎట్ల? బతుకులు మారేదెట్ల తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నంక కాంట్రాక్టు కార్మికుల నే పదమే సింగరేణిలో వినిపించదని సెలవిచ్చిన పెద్దలు 10 సంవత్సరాలు గడిచిన కాంట్రాక్టు కార్మికుల బాధలను వినటానికి కూడా ఇష్టపడడం లేదు ఏ పని చేస్తే ఎంత దోచుకోవచ్చో లెక్కలు వేయడం తప్ప ఇలాంటి దీనవస్థలో ఉన్న పేదజీవుల బాధలు బడుగుల కష్టాలు పట్టించుకునే నాధుడే కరువయ్యాడు పరిస్థితిని ఒకసారి గమనిస్తే *అందెశ్రీ* చెప్పినట్టు *మాయమైపోతున్నడమ్మా* *మచ్చుకైనా లేడు చూడు* *మానవత్వం ఉన్నవాడు* అన్న పాట అక్షరాలా సరిపోతుంది ఏ పనికి అయినా లంచం లేనిదే చేసే పరిస్థితులు మృగ్యమైనవి పైసలిచ్చుకొ లేని బడుగు జీవుల కష్టాలు తీర్చే మానవత్వం వాళ్ళు ఎవరు వీళ్ళ దిక్కు చూడరు సింగరేణి ప్రాంతంలో నిత్యం మురికి కాలువలు శుభ్రపరుస్తూ మురికి బతుకులయిపోయిన వీళ్ళ దీన గాధ పట్టించుకునేది ఎవరు మల్లోట్ల చ్చినయ్ గిప్పుడన్న గీళ్ళ బాధలు తీర్చేటోళ్లు ఎదురొస్తరేమో నని దీనంగా కాంట్రాక్టు కార్మికులు ఎదురుచూస్తున్నారు పెద్ద సారు అసెంబ్లీలో చెప్పిన ముచ్చట ఈ ఓట్లల్లనన్న తీరుత్తడేమో చూద్దాం మరి

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *