తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో నిరుపేద దళిత కుటుంబానికి చెందిన ఖాతా అంజవ్వ- రాజమల్లుల కుమారుడు ఖాత అభిలాష్ చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు.పేద కుటుంబానికి చెందిన తను చదువుకు పేదరికం అడ్డు కాదని ఉన్నత చదువులే లక్ష్యంగా అనేక కష్టనష్టాలను ఓర్చుకుంటూ అంకితభావంతో చదివి నేడు ఎంబిబిఎస్ సీటు సాధించాడు.
ఈ సందర్భంగా అభిలాష్ ను క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్,ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చినందున మంచిగా చదువుకొని ఉత్తమ డాక్టర్ గా స్థిరపడాలని ఆకాంక్షిస్తూ అంతేకాకుండా ఊరికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు.
అనంతరం రేణికుంట గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు,సర్పంచ్ బోయిని కొమురయ్య పాలకవర్గంతో కలిసి వైద్య విద్యార్థి ఖాతా అభిలాష్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కోయడ మురళి,ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు పారునంది జలపతి,మండల మహిళా ప్రధాన కార్యదర్శి కుంభాల లత,నాయకులు గొనెల మొండయ్య బోయిని చంద్రయ్య,ఎల్లయ్య,అంజి తదితరులు పాల్గొన్నారు.