కులమత బేధాలు లేకుండా అందరూ కలిసికట్టుగా జీవించాలి
చేర్యాల తహసీల్దార్
ఘనంగా పౌర హక్కుల దినోత్సవం
చేర్యాల… చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం ఘనంగా, కన్నుల పండుగగా, అంగరంగ వైభవంగా జరిపారు
పోతిరెడ్డిపల్లి గ్రామంలో దళితవాడలో పౌర హక్కుల దినోత్సవం జరిపారు ఈ కార్యక్రమానికి చేర్యాల తాసిల్దార్ జోగినపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించగా ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షుడు గూడూరు బాలరాజు అధ్యక్షత వహించగా తాసిల్దార్ మాట్లాడుతూ కులమత బేధాలు లేకుండా అందరూ కలిసికట్టుగా జీవించాలని సూచించారు పౌర హక్కులకు భంగం వాటిల్లకుండా కాపాడుకోవాలని సూచించారు మూఢనమ్మకాలను నమ్మకూడదని తెలిపారు గతంలో గుడిలోనూ బడిలోనూ దళితులను రానిచ్చేవారు కాదని అని అన్నారు అందుకే అందరం కలిసికట్టుగా జీవించాలని సూచించారు
సమాజ సేవకుడు కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సమావేశాన్ని నిర్వహించినందుకు తాసిల్దార్ కు ధన్యవాదాలు తెలిపారు
అనంతరం గ్రామస్తులంతా కలిసి తాసిల్దార్ ను ఘనంగా సన్మానించారు
ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నవీన్ కుమార్ ఆర్ ఐ రాజేందర్ రెడ్డి సమాజ సేవకుడు కత్తుల భాస్కర్ రెడ్డి గ్రామ సర్పంచ్ కత్తుల కృష్ణవేణి. ఉప సర్పంచ్ గూడెల్లి మాధవి పంచాయతీ కార్యదర్శి పల్లె రజిత వార్డు మెంబర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
