*చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రకటన వచ్చేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం…*
*ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి అందే బీరన్న…..*
చేర్యాల: ఆగస్టు 31 చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేసేంతవరకు మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి కామ్రేడ్ అందే బీరన్న అన్నరు చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ ఆధ్వర్యంలో నాలుగో రోజు కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలను ఉద్దేశించి మాట్లాడుతూ తమ ప్రాంతాన్ని చేర్యాల మద్దూరు కొమరవెల్లి దూల్మిట్ట ప్రాంతాలను సిద్దిపేట జిల్లాలో కలిపిన తర్వాత అభివృద్ధికి నోచుకోలేదని అనేక రకాల ప్రభుత్వ పథకాలలో ప్రజలకు కాకుండా బి ఆర్ ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే అందించారని అన్నారు చేర్యాల ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల నుండి అనేక దఫాలుగా ఉద్యమాలు నిర్వహిస్తున్నామని కనీసం మా ప్రాంత ఆవశ్యకత అస్తిత్వం కోసం పోరాడుతుంటే కూత వేటు దూరంలో ఉన్న మంత్రి హరీష్ రావు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎన్నికలలోపు చేర్యాల రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు తెలంగాణ ఉద్యమంలో చేర్యాల ప్రాంతం ముందుండి అప్పటి టిఆర్ఎస్ పార్టీని గెలిపించిందని ఇక్కడ ప్రజల అవసరాలను తీర్చలేని దద్దమ్మ ఎమ్మెల్యే ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని గతంలో మునిసిపల్ ఎన్నికల్లో రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్న ముత్తిరెడ్డి ఇప్పటివరకు ఏ ఒక్క హామీని ప్రభుత్వం దృష్టికి కానీ ముఖ్యమంత్రి దృష్టికి కానీ చేర్చలేదని అన్నారు ప్రజలు కోరుకుంటున్న రెవెన్యూ డివిజన్ ని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ నిరాహార దీక్షలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు రామగల్ల నరేష్ ,ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర నాయకులు పాకాల ఇసాక్,స్టూడెంట్ బ్లాక్ జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు, భారత నాస్తిక సమాజం రాష్ట్ర నాయకులు రమేశ్,తెలుగుదేశం పార్టీ మండల నాయకులు మహమ్మద్ ఇక్బాల్ ,తెలంగాణ పంబాల సంఘం నాయకులు కాటం మహేష్ , అంబేద్కర్ యువజన సంఘం నాయకులు రామగల్ల కిషోర్, మంగోలి యాదగిరి పోలోజూ కుమార్, తదితరులు దీక్షలో ఉన్నారు
