ప్రాంతీయం

*ప్రతి ఒక్క సభ్యుడు సంఘ బలోపేతానికి పాటుపడాలి*

117 Views

ఎల్లారెడ్డిపేట మండలం, అల్మాస్పూర్, గ్రామంలో, ఎల్లారెడ్డిపేట, మండలవిశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం, ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు, మండల ప్రధాన కార్యదర్శి, వంగాల వసంత్ కుమార్ చారి, మాట్లాడుతూ సంఘ పతిష్టతకు ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు పాటుపడాలని సంఘాలు బలంగా ఉంటేనే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తుందని మనకు రావలసిన నిధులను రాబట్టుకోవచ్చని మండలంలోని అందరి విశ్వబ్రాహ్మణులకు ఫోర్త్ కేటగిరి విద్యుత్ మీటర్లు మంజూరు చేపిస్తామని అటవీ శాఖ అధికారులు, కోత మిషన్ల వద్దకు వచ్చి ఇబ్బందులు పెట్టకుండా చూస్తామని, ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణునికి లేబర్ కార్డు ఇప్పించేందుకు కృషి చేస్తామని అన్నారు, ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు చెలిమెల ఆంజనేయులు చారి, రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘ ఉపాధ్యక్షుడు దుంపటి జనార్దన్ చారి, జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ చారి, జిల్లా ప్రచార కార్యదర్శి శ్రీరామోజు దేవరాచారి, మండల సంఘ సభ్యులు అల్మాస్పూర్ గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7