IOCL వన్ టైం స్కాలర్షిప్ కు రాచర్ల గొల్లపల్లి విద్యార్థిని ఎంపిక…
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు వన్ టైం స్కాలర్షిప్ కింద వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
10 వ తరగతిలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన 75 మంది విద్యార్థులను ఎంపిక చేసినారు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముగ్గురు ఎంపిక కాబడినారు. అందులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాచర్ల గొల్లపల్లి లో 10వ తరగతి విద్యనభ్యసించి 10 జీపీఏ సాధించిన బిరదర్ శ్రియ ఎంపిక కాబడింది.
ఐఓసీఎల్ వారు బిరదర్ శ్రియ కు 10000 రూపాయల నగదు పారితోషకాన్ని అందించనున్నారు.
ఈ సందర్భంగా బిరదర్ శ్రియను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ మురళీధర్ గారు , ఎస్ఎంసి చైర్మన్ గోగూరి శ్రీనివాస రెడ్డి గారు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అభినందించారు.
