ప్రాంతీయం

జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి

62 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ జయంతి వేడుకలను ఆదివారం రోజున ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ చంద్రయ్య  ముందుగా బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం అదనపు ఎస్పీ మాట్లాడుతూ…అంబేద్కర్ ఆశయాలు ఆలోచనలకు తగ్గట్లుగా మన విధులను కొనసాగించాలని, నిరుపేద వర్గాల ప్రజలకు న్యాయం అందించే విధంగా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, నిరుపేద వర్గాలకు తగు న్యాయం అందించినాడే అంబేద్కర్ కి నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామని తెలియజేశారు.అంబేద్కర్ కి నివాళులర్పించిన వారిలో ఆర్.ఐ లు యాదగిరి, రమేష్ , పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది వున్నారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్