దుబ్బాక అక్టోబర్ 12:20 మంది పెద్దగుండవెళ్లి యువత బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా.
దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి గ్రామ 20 మంది బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ యువత నేడు మెదక్ పార్లమెంటు సభ్యులు,దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరడం జరిగింది.
వారికి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీ లోకి ఆహ్వానించిన మెదక్ పార్లమెంటు సభ్యులు,దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి.
ఈ సందర్బంగా బీజేపీ సీనియర్ కార్యకర్త ఆటకారి చంద్రం మాట్లాడుతూ మేము నమ్మి గెలిపించిన నాయకుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు
మేము రఘునందన్ రావుకి ఎంత సేవ చేసిన మాకు ఫలితం లేకుండా పోయింది.
మేము కేసీఆర్ పథకాలకు ఆహర్షితులై, కేసీఆర్ బలపరిచిన అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపుకై నేడు బీఆర్ఎస్ పార్టీ లో చేరడం జరిగింది అని తెలిపారు.




