వీణవంక అంగట్లో.. ఇసుక లారీల జోరు…
రైలు భోగిలను తలపిస్తున్న ఇసుక లారీల వరుస..
వందే భారత్ రైలును తలపిస్తున్న మట్టి టిప్పర్ల స్పీడు…
ఇసుక లారీ ఢీకొని మేక పిల్ల మృతి
ఒకవైపు ఇసుక లారీలు… మరోవైపు మట్టి టిప్పర్లు …
ఇసుక లారీల, టిప్పర్ల స్పీడుకు , జంకుతున్న జనాలు..
నిర్లక్ష్యంగా అధికారులు, పట్టించుకోని ప్రజాప్రతినిధులు ?
వీణవంక, ఆగస్టు 25 (జన సైన్యం ప్రతినిధి).
వీణవంక మండల కేంద్రాన్ని ప్రతి శుక్రవారం వారసంత చుట్టు గ్రామాల ప్రజలతో జన సందోహంతో సాయంకాల సమయాన జాతర వలె, వారానికి క్రమక్రమంగా జనతాకిడి పెరుగుతూ వస్తుంది. 30 సంవత్సరాల క్రితం వీణవంకలో వారసంత సాగగా , కొన్నాళ్లకే ఆగిపోగా, గ్రామ సర్పంచ్ నీల కుమారస్వామి ముందు చూపుతో ఆలోచించి, గ్రామ అభివృద్ధి ధ్యేయంగా గ్రామంలో వారసంతకు కావలసిన,స్థలం,విద్యుత్, త్రాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి, ఇలాంటి రుసుము లేకుండా వ్యాపారాలు అమ్ముకునే విధంగా శుక్రవారం బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్న వారసంతలో,సాయంత్రం సమయాన చుట్టుపక్క గ్రామాల ప్రజలు, అశేష జన వాహినితో శుక్రవారం అంగడి కికిరిసిపోగా, అదే సమయాన భారీ ఇసుక లారీలు వరుసగా, పది నిమిషాల వ్యవధిలో ఆరు లారీలు వరుసగా రావడం,దాదాపుగా 20 లారీలు రెండు గంటల లోపే, ఇసుక లారీలకు ఎదురుగా,మట్టిప్పర్ల స్పీడు.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తలపిస్తుందని ప్రజలు వాపోతున్నారు.వారసంతలో లారీల రాక, టిప్పర్ల స్పీడు ప్రజలందరినీ భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఇంకా చిన్నపిల్లలు, వాహనదారులు, వ్యాపారస్తులు బెంబేలెత్తిపోతున్నారు. సాయంత్రం ఎన్నడూ లేని విధంగా ఇసుక లారీల రాక, ఒకేసారి ఇన్ని లారీలు రావడం ఇదే మొదటిసారి అని,వారసంతా ప్రాంగణం మొత్తం లారీల మోతతో దద్దరిల్లితోందని, లారీల స్పీడ్‌కు వారసంత దుమ్ము ఆవరించి పడుతుందని, ఎలాంటి ప్రమాదాలు జరగకముందే, అధికారులు నివారణ చర్యలు చేపట్టాలని, ఇప్పటికైనా రోడ్డు రవాణా శాఖ అధికారులు, ఇసుక మైనింగ్ అధికారులు , హామీ అధికారులు, ప్రజా ప్రతినిధులు మేల్కొని, శుక్రవార వారసంత రోజున, ఇసుక లారీల రవాణాను,దారి మళ్లించాలని ప్రజలు కోరుతున్నారు.
