Breaking News

వీణవంక కేజీబీవీ లో వాటర్ సమస్య ఎదుర్కొంటున్న విద్యార్థులు..

100 Views

వీణవంక కేజీబీవీలో నీటి సమస్య ఎదుర్కొంటున్న విద్యార్థులు..

సక్రమ విధులు పాటించని ప్రిన్సిపల్

డ్యూటీల సాకుతో క్రింది స్థాయి సిబ్బందికి వేధింపులు..

నీటి సమస్య 15 రోజులు కావస్తున్నా పట్టించుకోని అధికారిని..

అయోమయంలో కేజీబీవీ విద్యార్థులు ….

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పి డి ఎస్ యు అధ్యక్షులు అంగిడి కుమార్

వీణవంక, ఆగస్టు 25 ( జన సైన్యం ప్రతినిధి ).

పి డి ఎస్ యు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్
వీణవంక మండల అధ్యక్షులు అంగిడి దేవేందర్ అధ్యక్షతన
ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంగడి కుమార్ మాట్లాడుతూ… గత 15 రోజుల నుండి వాటర్ లేక విద్యార్థులు చాలా రకాలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధించిన కేజీబీవీ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారు. పాఠశాల ప్రిన్సిపల్ విధుల నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, విధులు సక్రమ నిర్వహించక పోగా , కింది సిబ్బందిని డ్యూటీలో సాకుతో వేధింపుల గురిచేస్తుందని సిబ్బంది వాపోతున్నారు. వాటర్ సమస్య 15 రోజులు కావస్తున్న, రిపేర్ చేయించక విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని, ప్రత్యక్షంగా, పరోక్షంగా విద్యార్థులను మానసికంగా, శరీరకంగా హింసిస్తున్నారని, ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు పలు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని, సత్వరమే సంబంధించిన కేజీబీవీ సెక్టార్ ఇంచార్జ్ విద్యార్థుల యొక్క సమస్యను పరిష్కరించాలని అలాగే నిర్లక్ష్యంగా వివరించిన సంబంధించిన సిబ్బంది పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్యం విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ధనుష్,హరీష్, వినయ్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *