గౌడ సంఘం మండల అధ్యక్షుడిగా బొమ్మగాని వెంకటేశం ఎన్నిక…
* గౌరవాధ్యక్షుడుగా ఆకుల మొగిలి, ప్రధాన కార్యదర్శిగా బుర్ర తిరుపతి గౌడ్ ఎన్నిక…
చిగురుమామిడి :కరీంనగర్ జిల్లా చిగురుమామిడి గౌడ సంఘం మండల అధ్యక్షుడిగా గాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బొమ్మగాని వెంకటేశం గౌడ్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయ ఆవరణలో జరిగిన గౌడ సంఘం మండల స్థాయి సమావేశంలో మండల కమిటీని ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షుడిగా ఇందుర్తి మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఆకుల మొగిలి, బండారుపల్లి చంద్రయ్య గౌడ్,ఆకుల శ్రీనివాస్ గౌడ్,మాజీటీసీ పరకాల కొండయ్య గౌడ్,ప్రధాన కార్యదర్శిగా ముల్కనూర్ గ్రామానికి చెందిన బుర్రయ్య తిరుపతి గౌడ్, కార్యదర్శిగా బత్తిని మల్లేశం గౌడ్, కొండ కనకయ్యగౌడ్, వీరగోని విజ్జగిరి గౌడ్, ఆర్గనైజింగ్ ఇన్ చార్జిగా ముల్కనూర్ గ్రామానికి చెందిన పూదరి వేణు గౌడ్, కోశాధికారిగా ఉల్లంపల్లి గ్రామానికి చెందిన చెప్పాల శ్రీనివాస్ గౌడ్,సలహాదారులుగా దేశిని రాజయ్యగౌడ్,బుర్ర నారాయణ, తోళ్లపల్లి సంటిత్ శ్రీనివాస్,తాళ్లపల్లి కార్యవర్గ సభ్యులు బండరిపల్లి రాజమల్లుగౌడ్,పులి పరశురాములు,గట్టు మొగిలి,గట్టు మధుగౌడ్,బుర్ర భద్రయ్య,బుర్ర లక్ష్మణ్,సుధగోని మధుగౌడ్ ఎన్నుకున్నట్లు గౌరవ అధ్యక్షుడు ఆకుల మొగిలి.తమ ఎన్నికకు సహకరించిన కుల బంధువులకు నూతన కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అందరూ ఐక్యతతో సంఘం అభివృద్ధికి కృషి చేశారు.
