తెగిపోయిన మట్టి రోడ్డుకు బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలి
సీపీఐ ఆధ్వర్యంలో గ్రామస్తుల ఆందోళన
సీపీఐ మండల కమిటీ సభ్యుడు కత్తుల భాస్కర్ రెడ్డి డిమాండ్
చేర్యాల… చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయిన రోడ్డుకు వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సీపీఐ మండల కమిటీ సభ్యులు కత్తుల భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు.
పోతిరెడ్డిపల్లి గ్రామం మీదుగా పడమటి కేశపూర్, లింగంపల్లి, నాగిరెడ్డిపల్లి, చుంచన కోట, జయల తదితర గ్రామాలకు వెళ్లాలంటే రోడ్డు తెగిపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు
ఈ కార్యక్రమంలో సాధమైన చంద్రయ్య, పోరెడ్డి నరసయ్య, గర్నపల్లి కనుకయ్య, సాదమైన రమేష్ పో రెడ్డి వెంకటేశం, గన్నపల్లి బాలమల్లు, జింకల బాలమల్లు ఉన్నారు.
