*బైక్‌ను ఢీకొట్టిన స్కూల్ బస్సు*
హైదరాబాద్:ఆగస్టు 02
బాచుపల్లి వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలిసింది ఈ ప్రమాదంలో బాలిక మృతి చెందింది.
పాఠశాల బస్సు వెనుక నుండి బైకును ఢీకొట్టగా బాలిక (8) మృతి చెందింది. ఈ ప్రమాదంలో తండ్రికి తీవ్ర గాయాలు అయ్యాయి. బైకుపై బాలికను తండ్రి పాఠశాలకు తీసుకెళ్తుండగా బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
