*అసలు జనగామను నియోజకవర్గాన్ని ???? అభివృద్ధి చేసే నిజమైన నాయకుడు కావాలి…* పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి కాకుండా జనగామ లో ఇంకెవరున్నారు?
పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు నిలిచారు, ఇప్పటివరకు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా కానీ జనానికి ఎం చేసింది లేదు… ఇప్పటికైనా వీళ్ళు ఇద్దరిలో ఎవరికీ టికెట్ ఇస్తే జనగామను ఎంతో కొంత బాగుచేసే అవకాశం ఉంది. కానీ నిన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి కెసిఆర్ పై కొన్ని వివాదస్పద వాక్యాలతో ఛాన్స్ పోగొట్టుకున్నాడేమో.. నిన్న కాక మొన్న వార్తలు వచ్చినట్టు మద్దూరు మండలానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ తిగుళ్ళ కృష్ణమూర్తి తో ప్రయోగం చేస్తే ఖచ్చితంగా బిఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుంది. లేదా అదే మండలానికి చెందిన హైదరాబాద్ లోని ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్ కు ఇస్తే తన డబ్బులతో ఒంటి చేత్తో గెలిపించుకొస్తాడు. ఏది ఏమైనా ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీకి గెలిచే అవకాశం ఉన్న సీట్ జనగామ కాబట్టి వీళ్లలో ఎవరైనా ఒక మంచి అభ్యర్థికి ఇస్తే మా జనగామ జనాలకు కూడా మేలు చేసిన వారవుతారు.
