*విమానంలో మందుబాబుల హల్‌చల్..శంషాబాద్‌లో అత్యవసరంగా దించిన పైలట్.*
శంషాబాద్: దుబాయ్ నుంచి కొచ్చికి బయలుదేరిన ఓ విమానంలో నలుగురు ప్రయాణికులు మద్యం మత్తులో తోటి ప్రయాణికులతో అమర్యాదగా ప్రవర్తించారు._
ఇదేమని అడిగిన సిబ్బందిపై, ఇతర ప్రయాణికులపై దాడికి యత్నించారు. దీంతో విమానాన్ని పైలట్ దారిమళ్లించి శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారని ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు ఆ నలుగుర్నీ భద్రతాధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్జీఐఏ ఠాణా పోలీసులు తెలిపారు.
