–బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుల్లెల పవన్.
బీఆర్ఎస్ కుల ఒత్తిడితోనే బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.పుల్లెల పవన్ కుమార్ ఆరోపించారు.బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు జరుగుతున్న నిరసన కార్యక్రమాలలో భాగంగా గురువారం మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు ముట్టడికి వెళుతున్న తిమ్మాపూర్ మండల కార్యకర్తలను ఎల్ఎండి పోలీసులు ముందస్తుగా 12మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకొని పరామర్శించారు.
ఈ సందర్బంగా ముందస్తు అరెస్ట్ లను ఉద్దేశించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పవన్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రజలకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేయడం ప్రజల హక్కని పేర్కొన్నారు.మానకొండూర్ నియోజకవర్గం నాయకుడు సొల్లు అజయ్ వర్మ మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారం లోకి వస్తుందని అన్నారు.
అరెస్ట్ అయిన వారిలో మండలbఅధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి,జిల్లా కార్యవర్గ సభ్యులు మావురపు సంపత్, బూట్ల శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శులు కిన్నెర అనిల్,గొట్టిముక్కల తిరుపతి రెడ్డి,కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బోనాల మోహన్,ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఎర్రోజు లక్ష్మణ్,అధికార ప్రతినిధి తాళ్లపెల్లి రాజు గౌడ్, కార్యవర్గ సభ్యులు కొయ్యడ శ్రీనివాస్ గౌడ్,మండల ఉపాధ్యక్షులు పబ్బ తిరుపతి,బిజెవైఎం అధ్యక్షులు గడ్డం అరుణ్,కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్,రేగూరి సుగుణాకర్ తదితరులు ఉన్నారు.