24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
మర్కుక్ : పాములపర్తి
22.01.2024
మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన శార్దాని నర్సవ్వ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి తక్షణ సాయంగా ఆర్థిక నగదు సాయాన్ని అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆపద సమయంలో ఆ కుటుంబాలకు అండగా ఉండడం మన బాధ్యతని సాటి మనిషి దుఃఖం లో ఉన్నప్పుడు పక్కన నిలబడి ఉండడం చాలా ముఖ్యమన్నారు. వారితో పాటుగా కర్రోళ్ల నర్సిములు ,శ్రీగిరిపల్లి కృష్ణ ,దుబాషి బాలయ్య కొండనోళ్ల నర్సయ్య, అక్కారం నర్సయ్య ,మొద్దు చెంద్రం, కర్రోళ్ల మల్లేష్ ,చవిటిదాని బిక్షపతి, పోచయ్య ,స్వామిలు ఉన్నారు.
