Breaking News

మానకోండూర్ బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్

113 Views

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, దళితులకు 3 ఎకరాల భూమి వంటి హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ గురువారం భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంత్రి గంగుల కమలాకర్ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వగా అట్టి కార్యక్రమానికి వెళ్లకుండా బిజెపి మానకొండూరు మండల నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి మానకొండూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.

అరెస్ట్ అయిన వారిలో బిజెపి జిల్లా కార్యదర్శి రంగు భాస్కరాచారి, మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు రావుల శంకరాచారి, ఓబిసి కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బోంగొని శ్రీనివాస్ గౌడ్, ఓ బి సి మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మియాపురం లక్ష్మణాచారి, కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి బోల్ల శ్రీరాములు, బీజేవైఎం మండల అధ్యక్షులు బాషాబోయిన ప్రదీప్ యాదవ్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఆడప రవి, ఓబీసీ మోర్చా మండల కార్యదర్శి ఆసరి రమేష్ యాదవ్, సీనియర్ నాయకులు బొడ్డు సాయిలు, కృష్ణా, బొంగోని సతీష్ ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *