-బీఆర్ఎస్ పార్టి జిల్లా అధ్యక్షులు జీవి రామక్రిష్ణ రావు
(తిమ్మాపూర్, నవంబర్ 18 )
రాష్ట్ర ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ రథసారథి
కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాల్గొననున్న ప్రజా ఆశీర్వాద సభను ఈ నెల 20వ తారీకు సోమవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గo తిమ్మాపూర్ మండల కేంద్రంలోని స్థానిక శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఉ. 10 గo.లకు నిర్వహించే సభకు మానకొండూరు నియోజక వర్గం లోని ఆయా మండల, గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులతో పాటు మహిళలు యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపు నిచ్చారు. శనివారం మానకొండూర్ మండల కేంద్రంలో మీడియా ప్రతినిధి సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సుడా చైర్మన్ జి.వి రామకృష్ణారావు మాట్లాడుతూ…
సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ అధ్యక్షతన శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ప్రజాఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తో పాటు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు విచ్చేయనున్నారు.
ఈ సభలో సీఎం కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు చేసిన అభివృద్ధి పనులతో పాటు చేపట్టబోయే అభివృద్ధి పనులు, నూతన సంక్షేమ పథకాలతో కూడిన వరాల జల్లులు, నూతన మేనిఫెస్టో కు సంబంధించి పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల సమక్షంలో వెల్లడించనున్నారు. ఈ ప్రజా ఆశీర్వాద సభకు దాదాపు 50 వేల మంది పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొననున్నట్లు తెలిపారు. సీఎం కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం గడచిన పది సంవత్సరాలుగా వెనుకబడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు, నిధులు, పట్టణ, గ్రామాల అభివృద్ధి పై దృష్టి పెట్టి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అభివృ ద్ధిలో ఎంతో పురోగతి సాధించామని, అన్ని రంగా లలో అభివృద్ధి సాధించి నేడు దేశంలోనే నెం.వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ ది అని పేర్కొన్నారు.
రెండు సార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఎమ్మెల్యే గా రసమయి బాలకిషన్ ను గెలిపించి అన్ని రంగాల అభివృద్ధితో పాటు అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. నియోజక వర్గ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి…కాంగ్రెస్, బిజెపి పార్టీలో మాయ మాటలను నమ్మి మోసపోతే మళ్లీ గోసపడతామని, అభివృద్ధి కుంటుపడి మళ్లీ అంధకారం అవుతుందని పేర్కొన్నారు. 3వ సారి బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి, కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్ తో పాటు పలు గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.