తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన ఉమ్మెంతల మధుసూదన్ రెడ్డి (26), ఉమ్మెంతల శ్రీకాంత్ రెడ్డి (30) అనే ఇద్దరు అన్న – తమ్ములు రెండు వారాల వ్యవధిలో గుండె పోటుతో మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం రేణికుంట గ్రామానికి చెందిన ఉమ్మెంతల చంద్రారెడ్డి చిన్న కుమారుడు ఉమ్మెంతల మధుసూధన్ అలియాస్ మధుకర్ రెడ్డి జీవనోపాధి కోసం హైదరాబాద్ లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా ఈ నెల 3న గుండె పోటుకు గురిఅయ్యి మరణించగా, పెద్ద కుమారుడు ఉమ్మెంతల శ్రీకాంత్ రెడ్డి అలియాస్ సంతోష్ రెడ్డి కరీంనగర్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నాడు. ఇతడు తమ్ముని చిన్నకర్మ రోజు గుండె పోటుకు గురిఅయ్యి బుధవారం చికిత్స పొందుతూ హైదరాబాద్ లోని నిమ్స్ వైద్యశాల లో మరణించాడు. 15 రోజులు వ్యవధిలో అన్నదమ్ములు ఇద్దరు చనిపోవడంతో రేణిగుంట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి..
