బిఎస్‌పి మార్కుక్ మండల కమిటీ ఆధ్వర్యంలో
రిజర్వేషన్ డే వేడుకలు
బహుజన్ సమాజ్ పార్టీ మార్కుక్ మండల అధ్యక్షులు ఇసకంటి బాబు గారి అధ్యక్షతన మండల కేంద్రంలో రిజర్వేషన్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి కొండనోళ్ళ నరేష్ మాట్లాడుతూ కొల్హాపూర్ సంస్థానంలో ఛత్రపతి సాహూమహరాజ్ గారు తన రాజ్యంలో వెనుకబడిన కులాలకు 50 రిజర్వేషన్లు 1902 జులై 26 వ రోజున మొదలు పెట్టి సామాజిక న్యాయానికి దారులు బహుజనుల వేగు చుక్క అన్నారు. ఛత్రపతి సాహు ఆలోచన అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా సామాజిక న్యాయం కోసం కొనసాగడం జరిగింది.దేశ జనాభాలో ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా,సమాన అవకాశాలు అనే సామాజిక న్యాయ సూత్రాన్ని పాటిస్తూ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచారు సాహు మహారాజ్ ఆశయాల కోసం రాష్ట్రంలో బిసిలకు వారి జనాభాకు అనుగుణంగా రాబోయే ఎన్నికల్లో బిసిలకు 60 నుండి 70 సీట్లు ఇచ్చే ఏకైక పార్టీ బిఎస్పీ అని అన్నారు.BRS, BJP పార్టీలు BC లకు ఎన్ని సీట్లు ఇస్తారని,అలాగే మంత్రి వర్గంలో BC ల వాటా ఎంత అని,
ఈ కార్యక్రమంలో ప్రస్తుతంగూడెం గ్రామ అధ్యక్షులు తెడ్డు నవీన్ గారు, BVF అనిల్ గారు, పాములపర్తి గ్రామ నాయకులు కొండనోళ్ళ వంశీ, మార్కుక్ గ్రామ నాయకులు అనిల్ ,అశోక్, సురేష్, నందు, బన్నీ, యాదగిరి గారు ఉన్నారు
