*అకునూర్ లో బి జే ర్ యూత్ అధ్యక్షులు *ఎర్రోళ్ల కృష్ణ* ఆధ్వర్యంలో ఘనంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు*
స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆకునూర్ అంగడి బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద యూత్ అధ్యక్షులు ఎర్రోళ్ల కృష్ణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఏర్రోళ్ళ కృష్ణ మాట్లాడుతూ మహనీయుల కోసం రెండు నిమిషాలు మౌనం పాటించి తదనంతరం మహనీయుల త్యాగాలు మరువలేమన్నారు, బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన రోజు స్వాతంత్రంగా నిలబడిన ఈనాడు తలెత్తుకొని గర్వంగా చెప్పుకునే రోజన్నారు, అంబేద్కర్ మార్గం లో నడవాలి , అంబేద్కర్ ఆలోచన, , విధి విధానాలను, అనుసరిస్తూ ముందుకు నడవాలి అని యువత కు ఆదేశించారు. పతాక ఆవిష్కరణ అనంతరం మిఠాయిలు పంచా పెట్టారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చీపురు రేఖా మల్లేశం, ఉపసర్పంచ్ , ఎంపిటిసిలు, మెంబర్లు గ్రామ సభ్యులు మార్కెట్ చైర్మన్, బీజేఆర్ యూత్ సభ్యులు , తదితరులు పాల్గొన్నారు.
