మర్కుక్ లో ఘనంగా హరేరామ నామ జప యజ్ఞం
దైవ నామస్మరణతోనే ముక్తి లభిస్తుందని గ్రామ పురోహితులు అప్పల మాధవ శర్మ, కార్తీక్ శర్మ,అన్నారు శనివారం నాడు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలోని రంగనాయక స్వామి దేవాలయంలో శ్రీ రుక్మిణి పాండురంగ ఆశ్రమం ఆధ్వర్యంలో శతకోటి హరే రామ నామ జప యజ్ఞం అత్యంత భక్తిశ్రద్ధలతో ఉదయం నుండి సాయంత్రం వరకు అత్యంత వైభవంగా హరే రామ నామ జప యజ్ఞం కార్యక్రమం నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మర్కుక్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా శ్రీనివాస్ మాట్లాడుతూ దైవ నామస్మరణతోనే మానవ జన్మకు సార్థకత చేకూరుతుంది అని ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని హరే రామ నామ జప యజ్ఞం లో పాల్గొన్న వారందరికీ దేవదేవుల్ల కరుణాకటాక్షాలు ఉంటాయని భజన చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో మర్కుక్ *మండల BRS పార్టీ మండల అధ్యక్షులు మర్కుక్ కరుణాకర్ రెడ్డి మరియు మర్కుక్ మండల రైతు బంధు సమితి అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ ,మర్కుకు వార్డ్ సభ్యులు అన్నారం బాపురెడ్డి,మర్కుక్ రెడ్డి సంఘం అధ్యక్షుడు మోహన్ రెడ్డి,*ఆర్యవైశ్య సంఘం నాయకులు శేఖర్ గుప్త తదితరులు పాల్గొన్నారు
