*జయశంకర్ సార్ ఆశయాలు కొనసాగిద్దాం*
జయశంకర్ సార్ జయంతి కార్యక్రమం టిఫిటిఎఫ్ గజ్వేల్ జోన్ కార్యాలయంలో జోన్ కన్వీనర్ సుంచు నరేందర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా రాష్ట్ర కౌన్సిలర్ బెల్దే రాజులు,జోన్ కన్వీనర్ సుంచు నరేందర్, కో కన్వీనర్ విద్యా సాగర్ లు మాట్లాడుతూ
తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రధాత,తెలంగాణ ఉద్యమంలో మరపురాని వ్యక్తి
జయశంకర్ సార్. ఉద్యమకారుడి నుండి మహోపాధ్యాయుడి దాకా ఆయన తెలంగాణకు దిక్సూచిగా నిలిచారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సేవలను తెలంగాణ ప్రజలు, భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా వారి సంకల్ప బలం రాష్ట్ర సాధనకు చేసిన నిర్విరామ కృషి అజరామరం అని కొనియాడారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన
కోసం ఆలోచనలకు పదును పెడుతూ, వ్యుహలను రచిస్తూ రాష్ట్ర సాధనకు ఆయువుపట్టు అయినారు. అందరి హృదయాలలో నిలిచారు.
బౌతికంగా వారు లేనప్పటికీ ఆయన చూపిన మార్గం లో నడుస్తూ ఆయన ఆశయసాదనకు కృషి చేయాలని అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో వర్గల్ మండల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి పర్వతం నర్నయ్య, పిల్లి రాములు, జగదేవపూర్ మండల అధ్యక్షులు, నేతి శంకర్, గజ్వేల్ మండల ప్రధాన కార్యదర్శి తాళ్ల నాగరాజు, దౌల్తాబాద్ మండల ప్రధాన కార్యదర్శి మాచపురం యాదయ్య,
జిల్లా కౌన్సిలర్లు పంబాల ఎల్లయ్య,జల్లెలశ్రీనివాస్ ,కటుకం రాజయ్య,సీనియర్ నాయకులు సత్యనారాయణ,మధుసూదన్,ఉపాధ్యాయులు కృష్ణ శ్రీనివాస్,మీనయ్య,మల్లేశం,వరప్రసాద్,ప్రభాకర్,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
