ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు7 ప్రభుత్వ కళాశాల విద్యకు ఆదరణ కరువవుతోంది ముస్తాబాద్ మండలంలోని జూనియర్ కళాశాలల సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు విస్మరించింది. అలాగే కేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడింది దీంతో ఇంటర్ కళాశాలల్లో కనీస వసతులు సమకూరలేదనే విమర్శలున్నాయి. కళాశాలల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టడంలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఇంటర్ విద్యకు రోజురోజుకు ఆదరణ కరువవుతూ కళాశాలకు కావల్సిన కనీస బాత్రూంల వసతులు చెట్లు చేమలు గుట్టలు కల్పన, అదేవిధంగా నర్సరీ పెంపకం ఉండడం ఆనాడు నిరాహార దీక్ష చేపట్టి బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కడంతోపాటు ఈనాడు ప్రభుత్వకళాశాల లభించేది కాదు పూర్తిస్థాయిలో అధ్యాపకుల నియామకంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వ కళాశాలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ భారీ వర్షాల కారణంగా ప్రవేశ ద్వారంవద్ద నిలువెత్తు నీరు నిలవడంవల్ల కాలేజీ పిల్లలకు ఆటంకాలకు తలెత్తడంతో ఇటు ప్రజాప్రతినిధులు అటు ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం స్థానిక నియోజకవర్గం మంత్రి చొరవ తీసుకోకపోవడం అమానుష్యంమనీ స్థానికుడు చింతోజి బాలయ్య ఆరోపించారు.
