Breaking News

వెంటనే ప్రారంభించాలి

81 Views

వరి కోనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి

నవంబర్ 8

నారాయణపేట జిల్లా మద్దూరు మండల్

వర్షాకాలం వరి పంటను రైతులు కోతలు ప్రారంభించి.15 రోజులు కావస్తున్నా ప్రభుత్వం మాత్రం వరి కోనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వలన రైతులు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారస్తులకు మద్దతు ధర కంటే 400-5 00ల రూపాయల వరకు తక్కువకు అమ్ముకుని నష్టపోవడంతో పాటు తుకాల్లో మోసం చేస్తున్నారు.

కాబట్టి జిల్లా కలెక్టర్ సంబంధిత జిల్లా అధికారులు స్పందించి కోనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య గౌడ్ ఓక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రైవేట్ వ్యాపారస్తులు రైతులతో తక్కువ ధరకు కొనుగోలు చేసి అవే వడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసే కోనుగోలు కేంద్రాల్లో వేసి ప్రభుత్వ మద్దతు ధరలకు అమ్ముకుని ప్రభుత్వ సొమ్ముని లూటీ చేసే అవకాశం ఉందని అన్నారు.

ప్రభుత్వం స్పందించి కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలని తూకల్లో మోసాన్ని మిల్లర్ల దోపిడీని అరికట్టాలని కోరారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *